అడ్డంగా ఉన్న చెట్లను తొలగింప చేసిన సర్పంచ్

అడ్డంగా ఉన్న చెట్లను తొలగింప చేసిన సర్పంచ్

1
TMedia (Telugu News) :

అడ్డంగా ఉన్న చెట్లను తొలగింప చేసిన సర్పంచ్
టి మీడియా, జులై12,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గత మూడు రోజులుగా నుండి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది.అంగడి బజార్, వద్ధ డ్రైనేజీ నుండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుంది.గ్రామ ప్రజలు ఎవరు బయటకు రానీ పరిస్థితి ,వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తు ఉండగా దుకాణాలు తెరుచుకొక పోగా – జనం తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. మండల పరిధిలోని చెరువులు కుంటలు నిండుకుండలా మారే పరిస్థితి కనబడుతుంది కాగా భారీ వర్షం కురుస్తుండడంతో నాచుపల్లి వెళ్లే దారిలో వర్షపు నీరు అధికంగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

 

Also Read : ఘనంగా రాకేష్ దత్త జన్మదినం వేడుకలు

మరియు కొడిమ్యాల నుండి పూడూరు వెళ్లే రోడ్డు పైన పెద్ద చెట్టు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలునిలిచిపోయాయని విషయం తెలుసుకున్న మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తక్షణమే స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను ఎక్స్లేటర్ల తో తీసివేశారు సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని మరియు పురాతనమైన ఇండ్లు గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube