ఎమ్మెల్యే కందాళ్ళ ఉపేందర్ రెడ్డిని కలిసిన సర్పంచ్
టీ మీడియా, ఫిబ్రవరి 2, తిరుమలాయపాలెం మండలం : తిరుమలయపాలెం మండలం పైనంపల్లి గ్రామంలోని ఇటీవల పైనంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తీగల రంగమ్మ అనారోగ్య కారణాల వలన రాజీనామా సమర్పించడం జరిగిన సందర్భంగా ఆమెను తొలగిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారము పైనంపల్లి గ్రామపంచాయతీ నందు మిగిలిన ఏడుగురు వార్డు సభ్యులలో నుండి ఉప సర్పంచ్ అయినటువంటి ధారావత్ శ్రీను నాయక్ ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా నాలుగో వార్డ్ మెంబర్ అయినటువంటి గుర్రాల నాగలక్ష్మిని జాయింట్ చెక్ పవర్ గా ఎన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా పైనంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ ధారావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ ధారావత్ శ్రీను నాయక్ ఒకటో వార్డు మెంబర్ నబిలే బాబు మరియు తదితరులు ఎమ్మెల్యే కందాళ్ల ఉపేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి విషయాన్ని చెప్పగా చాలా సంతోషించినారు ఇట్టి ఇట్టి కార్యక్రమంలో మిగతా వార్డు మెంబర్లు అందరు కూడా పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు