కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా రైతులపై కేసుల

సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆరోపణ

1
TMedia (Telugu News) :

కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా రైతులపై కేసుల

– సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆరోపణ

టీ మీడియా, అక్టోబర్ 27, జన్నారం :  మండలంలోని కడెం కెనాల్ కు సంబందించిన భూములను కబ్జా చేస్తుంటే సంబందిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వైస్ ఎంపీపీ సుతారి వినయ్,కో అప్షన్ సభ్యుడు మన్వర్ ఆలీఖాన్ ,తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్ తో పాటు మండలంలోని పలువురు సర్పంచ్ లు గురువారం ఎంపీడీవో సమావేశ మందిరంలలో ఎంపీపీ మాదాడి సరోజన అధ్యక్షతన జరిగిన సర్వసభ్యసమావేశం లో ఆరోపించారు. సాగు నీటిపై కడెం ప్రాజెక్టు డిప్యూటి డీఈ వెంకటేషం సభలో మాట్లాడుతూ తరుచుగా మండలంలోని పలు డిస్ర్టిబ్యూటర్ల పైపులను,తూములను రైతులు పగులగోడుతున్నారని ఇకపై ఇలాంటి చర్యలకు పూనుకుంటే కేసులు పెడుతామని చెప్పడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది,కెనాల్ భూములను కబ్జా చేస్తే కేసులు పెట్టకుండా సాగు నీటి విషయంలో రైతులపై ఎలా కేసులు పెడుతారని సర్పంచ్ లు,ఎంపీటీసీలు డిప్యూటి డీఈని నిలదీశారు.

Also Read : అగ్నిప్రమాదం.. 6 కార్లు సహా 14 వాహనాలు దగ్ధం

తాను ఆ విధంగా మాట్లాడలేదని కెనాల్ భూమి కబ్జా విషయమై పై ఆఫీసర్లకు తెలియజేస్తానని సభ్యులకు హమీనివ్వడంతో గందరగోళం సద్దుమనిగింది. మండలంలో గంజాయి వల్ల యువకులు పెడదారిపడుతున్నారని గంజాయి సాగుపై ఎక్సెజ్ ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సర్పంచ్ లు డిమాండ్ చేశారు. సర్పంచ్ ల డిమాండ్ పై ఎక్సెజ్ ఎస్ఐ రాబార్డ్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ గంజాయి సాగుకావడం లేదని మండలంకు అనుకుని ఉన్న కుమ్రంభీం జిల్లా తిర్యాణి మండలం నుండి జన్నారం మండలంకు సరఫర జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అరుణారాణీ,మార్కెట్ కమిటి ఛైర్మన్ సీపతి పద్మ,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube