పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

1
TMedia (Telugu News) :

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

 

టీ మీడియా,అక్టోబర్20, వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉన్న భారత కౌన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు. పద్మభూషణ్‌ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. గత వారం ఆ అవార్డును అందజేసినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ రంగంలో భారత ప్రజలతో పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు నాదెళ్ల తెలిపారు. వచ్చే జనవరిలో సత్యా నాదెళ్ల ఇండియాలో పర్యటించనున్నారు.

Also Read : రూపాయి మరింత పతనం..

నాదెళ్లకు భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పురస్కారానికి ఎంపికైన 17 మందిలో ఆయన ఒకరు. కౌన్సుల్‌ జనరల్‌ నాగేంద్ర ప్రసాద్‌తో పలు అంశాలపై సత్యా నాదెళ్ల మాట్లాడారు. భారత సమగ్ర అభివృద్ధిలో డిజిటల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీ రంగంలో భారత్‌ లీడర్‌గా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అంశాలను ఆ ఇద్దరూ చర్చించుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube