సత్యనారాయణ పూజా విధానం..

శుభ ముహుర్తం.. ప్రాముఖ్యత

0
TMedia (Telugu News) :

సత్యనారాయణ పూజా విధానం..

-శుభ ముహుర్తం.. ప్రాముఖ్యత

లహరి, జనవరి 18,ఆధ్యాత్మికం : హిందూ మత విశ్వాసాల ప్రకారం, సత్యనారాయణ వ్రతం చేయడం లేదా ఆ నారాయణుడి కథ వినడం, చదవడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సరంలోని తొలి మాసంలో సత్య నారాయణ వ్రతానికి సంబంధించిన శుభ ముహుర్తం ఎప్పుడొచ్చిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ పౌర్ణమిని చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు రూపమైన సత్యనారాయణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున నారాయణుడిని ప్రసన్నం చేసుకునేందుకు సత్యనారాయణ వ్రతం ఆచరించడం.. ఆ కథను వినడం లేదా చదవడం వంటివి చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో జనవరి 6వ తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి తిథి వచ్చింది. ఈరోజున సత్య నారాయణ వ్రతాన్ని ఆచరించే వారు విష్ణువు అనుగ్రహం పొందడమే కాకుండా ఆరోగ్యం, ఆదాయం, ఐశ్వర్యం, శ్రేయస్సు పొందుతారని పండితులు చెబుతారు. అంతేకాదు ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తుంటారో వారంతా పుష్య పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయి.

Also Read : తులసీ కోటలో దీపం వెలిగిస్తూ ఈ చిన్న పని చేయండి..

ప్రతి పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ ఉపవాసం ఆచరించే వారికి సత్యనారాయణుడు సుఖసంతోషాలు కలుగజేస్తాడని, తమ కోరికలు తీరుస్తాడని, తమ జీవితంలో అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తాడని, నమ్ముతారు. అందుకోసం ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం జపించాలి.
పూజా విధానం..
సత్యనారాయణ వ్రతం ఆచరించే వారు పౌర్ణమి తిథి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఆ తర్వాత పూజా గదిలో ఒక చెక్క పీటపై శ్రీ సత్యనారాయణుడి విగ్రహం ఉంచాలి. ఆ విగ్రహం లేదా ఫొటో వద్ద అరటి ఆకులు, మామిడాకులతో అలంకరించాలి. అనంతరం పువ్వులు, కుంకుమ సమర్పించి, పసుపుతో తిలకం రాయాలి. అనంతరం కలశం నిండుగా తమలాపాకులను ఉంచి, దేశీ నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.సత్యనారాయణ పూజ నిర్వహించడానికి కచ్చితమైన సమయమేమీ లేదు. ఈ పూజను ఎప్పుడైనా చేయొచ్చు. పాలు, పెరుగు, తేనే, నెయ్యి కలిపిన పంచామృతాన్ని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి.

Also Read : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

)సత్యనారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా తులసి పత్రాన్ని సమర్పించాలి. ఈ తులసి ఆకులు లేకుండా పూజ సంపూర్ణం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించే వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి.మీ జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోవడానికి పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం పఠించాలి. అలాగే ఈ మంత్రాలను జపించాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube