సత్యసాయి సంస్థ సేవలు అభినందనీయం

0
TMedia (Telugu News) :

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

టీ మీడియా,నవంబర్ 23, పెద్దపల్లి :

సత్యసాయి సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.మంగళవారం సత్యసాయి సేవా పాఠశాలలో వృద్ధులకు పిల్లలకు స్వెట్టర్,చద్దర్ల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.పేద ప్రజలకు విద్య వైద్యం,త్రాగునీటి సౌకర్యం అందించే దిశగా పెద్ద ఎత్తున కృషి చేసిన మహనీయుడు సత్యసాయి అని అదనపు కలెక్టర్ కొనియాడారు.విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పేద ప్రజలకు విద్య అందిస్తున్నారని, ప్రాణం లోని చివరి ఇ క్షణం వరకు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు.2006 సంవత్సరంలో తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో బాబా ని కలిసే అవకాశం కలిగిందని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విద్యార్థులు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదవాలని, భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు చేరుకొని మన కుటుంబం తో పాటు సమాజ శ్రేయస్సు దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.
సత్యసాయి సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వై. హనుమంతరావు,కన్వీనర్ లక్ష్మీనారాయణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Lakshminarayana lauded the services rendered by Satyasai  Seva Santha .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube