మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం
– బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్
టీ మీడియా, అక్టోబర్ 19, వనపర్తి బ్యూరో : మహిళల కోసం సీఎం కేసీఆర్ మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే కళ్యాణ లక్ష్మీ ఆరోగ్య లక్ష్మీ అమ్మఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేస్తుండగా రానున్న ఎన్నికల్లో గెలిస్తే మహిళల కోసం సౌభాగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రాగానే పేద మహిళలకు ప్రతీ నెల రూ. 3 వేల జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అని బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. ఈ పథకం బీపీఎల్ కార్డులు ఉన్నవారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చారు.
Also Read : ఇజ్రాయెల్ వెన్నంటి నిలుస్తాం
అని నవంబర్ 30న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube