గ్రామ ఆస్తి పై మాజీ మంత్రి కి జెడ్పీటీసీ సవాల్

గ్రామ ఆస్తి పై మాజీ మంత్రి కి జెడ్పీటీసీ సవాల్

0
TMedia (Telugu News) :

గ్రామ ఆస్తి పై మాజీ మంత్రి కి జెడ్పీటీసీ సవాల్

టీ మీడియా ,అక్టోబర్ 1, చిన్నంబావి:కొప్పునుర్ గ్రామ పెద్దన్నట్టు విషయంపై రాజకీయ నేతల పాత్ర గూర్చి కొప్పునూర్ గ్రామ రైతు వేదికలో శనివారం గ్రామ సర్పంచ్ , జెడ్పిటిసి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.గ్రామ సర్పంచ్ నంది కౌసల్యా మాట్లాడుతూకొప్పునూరు గ్రామ ప్రజలకు చెందిన జట్ ప్రోల్ గ్రామరెవెన్యూశివారులోగల116ఎకరాలభూమిసర్వే451,452,453,461,463,464,465,466,467,మొదిరాయి బర్క కొప్పునూరు గ్రామ పూర్వికులు గ్రామానికి చెందిన పశువులకు గొర్రెల మేత కొరకు నాడు గ్రామ పెద్దలు 1952 లో కొనుగోలు చేసిన భూమి పెద్దనట్టుగా ప్రసిద్ధి చెందింది ఆట్టి భూమిని ప్రస్తుతం పేరుమోసిన రాజకీయ నాయకుల అండదండలతో దాంగట్ల సుబ్బన్న ,శివ, నాగేష్ లతోపాటు గ్రామ శివారులోని సర్వే 427 గల రెండు ఏకరాల భూమిని కూడా మాదే అంటూ జంగ హరినాథ్ కోర్టు ద్వారా గ్రామానికీ చెందిన మహిళా ప్రజా ప్రతినిధులకు రైతు కమిటికి చెందిన 60 మందికి నోటీస్ లు పంపించారని ఈ నోటీసుల వెనుక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అస్తం ఉందని గత బుధవారం మాజీ మంత్రి పత్రిక విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు  .

సీALSO READ ;ఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

 

జెడ్పీటీసి కేసి రెడ్డి వెంకట్రావమ్మ మాట్లాడుతూ మాజీ మంత్రి జూపల్లి నా భర్త చిన్నారెడ్డి ఏదుగుదల చూసి ఓర్వలేకే మాపై ఆరోపణలు చేస్తున్నారని ఎన్ని కుట్రలు పన్నిన గ్రామ ఆస్తి పెద్దనట్టును వాదలబోమని గ్రామ ప్రజల తరుపున పోరాటం చేస్తామని మాజీ మంత్రి,అతని అనుచరులు గ్రామంపై చిత్తశుద్ధి ఉంటే సోమవారం ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్, ఎంపీటీసీ తగరం లక్ష్మి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇదన్న యాదవ్, సమితి అధ్యక్షుడు మధు నాయుడు,సింగల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్, కమిటీ పెద్దలు పుల్లారెడ్డి,శేఖర్ రెడ్డి,బిచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube