దేశాన్ని కాపాడుకుందాం రండి

దేశాన్ని కాపాడుకుందాం రండి

1
TMedia (Telugu News) :

దేశాన్ని కాపాడుకుందాం రండి
టీ మీడియా, మార్చి25,వేంసూరు : మోడీ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి భారత దేశాన్ని కాపాడుకుందాం రండి అని అఖిలపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు స్థానిక ఎర్ర రామయ్య భవనంలో సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు అధ్యక్షతన అఖిల పక్ష పార్టీల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల 28,29 తేదీలలో దేశ వ్యాప్త సమ్మె,గ్రామీణ బంద్ లను జయప్రదం చేయాలని నిర్ణయించారు.మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో: టిడిపి రాష్ట్ర నేత బొంతు భాస్కరరావు,మురళీ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేత పుచ్చకాయల సోమిరెడ్డి,సీపీఎంనేతలుమల్లూరుచంద్రశేఖర్,మోరంపూడివెంకటేశ్వరరావు,అర్వపల్లిగోపాలరావు,వెంకటేశ్వరరావు,ఎండిమందల వెంకటేశ్వరరావు,గడిపర్తి మోహన్ రావు, డంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Also Read : శ్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube