పంటలను కోతుల నుండి రక్షించుట కు విన్నుత ప్రదర్శనలు

పంటలను కోతుల నుండి రక్షించుట కు విన్నుత ప్రదర్శనలు

1
TMedia (Telugu News) :

పంటలను కోతుల నుండి రక్షించుట కు విన్నుత ప్రదర్శనలు

టీ మీడియా, మార్చి11, మధిర:రైతులు పంట లను అడవి జంతువుల,మరియు కీటకాలు నుండి నుండి రక్షించుకొనుటకు నానా తంటాలు పడుతూ వాళ్లకు తోచిన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మధిర మండలం దెందుకూరు గ్రామంలో కోతులు అధికం కావడంతో పంట పొలాలపై కోతులు అనేక సంఖ్యలో చేరి పంట నష్టం చేస్తున్నాయి. ఆ తరుణంలో ఓ రైతు తన సాగుచేస్తున్న ఐదెకరాల మొక్కజొన్న పంట కోతకు సిద్ధంగా ఉండటంతో కోతులు అధిక సంఖ్యలో గుంపులుగా చేరి తమ పంటను నాశనం చేయడంతో రైతు కి ఏం చేయాలో తోచక తన మొక్కజొన్న పంటను కోతుల నుండి ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచనతో ఓ వ్యక్తికి ఎలుగుబంటి దుస్తులను ధరింపజేసి వేషధారణలో ఉన్న వ్యక్తిని మొక్కజొన్న పంటచేనుకు తీసుకెళ్లి అరుస్తూ కోతులను తరమడం మొదలుపెట్టాడు, ఆ కోతులు ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తిని చూసి పంట చేల నుండి భయంతో ఆమడ దూరం పారిపోతున్నవి అని దాని వల్ల తమ పంటపొలాలనురక్షించుకుంటున్నామని తెలిపారు. తమ తోటి రైతులకు కూడా కోతుల నుండి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ సలహా సూచించారు.

Also Read : రసవత్తరంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube