అక్రమార్కుల నుండి చెరువులను కాపాడండి

అక్రమార్కుల నుండి చెరువులను కాపాడండి

1
TMedia (Telugu News) :

అక్రమార్కుల నుండి చెరువులను కాపాడండి

టీ మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : పెబ్బేర్ లో ఇరిగేషన్ ఎస్సీ కి కలవడానికి వెళ్లిన అఖిలపక్ష నాయకులు ఆయన కోర్టు కేసు ఉన్నందున హైదరాబాద్ వెళ్లడంతో టెక్నికల్ డి.ఈ కి వినతిపత్రం అందజేసి ఎస్సీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో అక్రమ లేఅవుట్లను తీసివేస్తామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకు ఇంకా ఆక్రమణలు జరుగుతున్నాయి తప్ప వాటిపై చర్యలు లేవని, మర్రికుంటను సర్వే చేసి వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని వడ్డేవాట రోడ్డులో సర్వే నెంబరు 515, 487 లో ఉన్న మూడు ఎకరాల కోమటికుంట చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు (అధికార పార్టీకి) చెందిన వారు ఆక్రమించుకొని ప్లాట్లు వేశారు.

Also Read : తప్పుడు ఆరోపణలు చేస్తున్న రియాజ్ అహ్మద్ ను బహిష్కరిస్తున్నాం

ఇది ముమ్మాటికి చట్టవిరుద్దమైన చర్య అని దీనిపై చర్య తీసుకోవాలని, పలు సంఘాలు ఇప్పటికే ఆందోళన చేశావి కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ,వారు ఎవరితో ములఖత్ అయ్యారు, ఏవైనా లావాదేవీలు జరిగి ఉoటాయని అనుమానంతో, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా కల్పించుకోవడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషాని, వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డిని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అని కోరడమైనది. నమ్మ చెరువు కట్ట కంటే ఎక్కువ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేష్ జయరాములు, కార్యదర్శి రమేష్ ఆంజనేయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube