కుక్కల బెడద నుండి రామగుండం కార్పోరేషన్ ప్రజలను కాపాడండి

-రామగుండం కమీషనర్ కు న్యూ ఇండియా పార్టీ వినతి

0
TMedia (Telugu News) :

కుక్కల బెడద నుండి రామగుండం కార్పోరేషన్ ప్రజలను కాపాడండి.

-రామగుండం కమీషనర్ కు న్యూ ఇండియా పార్టీ వినతి

టి మీడియా,నవంబర్ 26,గోదావరిఖని : రామగుండం కార్పోరేషన్ పరిధిలోని ప్రజలను కుక్కల బెడద నుండి కాపాడాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యం లో శనివారం రామగుండం కార్పోరేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం కమిషనర్ సుమన్ రావు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా న్యూ ఇండియా పార్టీ నాయకులు మాట్లాడుతు… రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవలి కాలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి ఆని అవి అనేక మంది పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయిని అన్నారు.అంతేకాకుండ మృతి కూడ చెందారు అని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ సమస్యపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు,మహిళలు, వృద్దులు శునకాలను చూసి జంకుతున్నారు అని ఇవే కాకుండా ఇక్కడ కోతులు ఇళ్లపైకి వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి అని వాపోయారు.పందులు ప్రజల మధ్య సంచారం ఎక్కువ చేయడం మూలాన ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు అని మండి పడ్డారు.

Also Read : ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

అంతే కాకుండా పట్ట పగలు,రాత్రిపూట గోదావరిఖని ప్రధాన చౌరస్తా,ఇతర ప్రధాన కూడలి రోడ్ల పై ఆవులు గేదెలు ఉండి దారి వెంబడి వెళ్ళే కార్మికులకు వాహన దారులకు అంతరాయం కలిగిస్తున్నాయి అని ప్రమాదాలు కూడ అనేకం జగినవి అని ఈసందర్భంగా గుర్తు చేశారు.ఇప్పటికైన రామగుండం కార్పొరేషన్ అధికారులు స్పందించి కుక్కలను,పందులను, కోతులను,ఆవులను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాలి అని లేదా వాటికి ఏదైనా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంరక్షించాలి అని కోరారు లేని పక్షంలో న్యూ ఇండియా పార్టీ ఆధ్యర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.న్యూ ఇండియా పార్టీ నాయకులు నగునూరి విజయ్ కుమార్, ఆషాఢం ముఖేష్ ఆద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో అద్యక్షులు డా.జె వి రాజు, ఉపాధ్యక్షులు జె.లక్ష్మి నారాయణ,రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి,ప్రధాన కార్యదర్శి రామగిరి విక్రంసింగ్, మహిళానాయకురాలు గంట బబితసోని,న్యాయ వాది ఇరికిల్ల హేమాప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube