ఖమ్మం రోమన్ కథోలికా మేత్రాసనం ను కాపాడండి అంటూ ధర్నాచౌక్లో నిరసన దీక్ష

బిషప్ మైపన్ పాల్ యొక్క మొండి వైకరి నశించాలి

1
TMedia (Telugu News) :

ఖమ్మం రోమన్ కథోలికా మేత్రాసనం ను కాపాడండి అంటూ ధర్నాచౌక్లో నిరసన దీక్ష

బిషప్ మైపన్ పాల్ యొక్క మొండి వైకరి నశించాలి

టి మీడియా,జూన్ 25,ఖమ్మం : రోమన్ కథోలికా మేత్రాసనం ను కాపాడండి అంటూ ధర్నాచౌక్లో నిరసన దీక్ష ను చేపట్టారు . ఖమ్మం మేత్రసనం మరియు కథొలికా విశ్వాస అభివృద్ధి కొరకై ఎందరో గురువులు మరియు కన్య స్త్రీలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ జీవితాలను త్యాగం చేసి కథోలిత ప్రజల అభివృద్ధి కొరకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి సృష్టించిన సంపదను బైపాస్ రోడ్డునకు ప్రక్కన గల విలువైన భూములను మైపాన్ పాల్ బిషప్ గారు మరియు తనకు అనుకూలమైన స్వార్థపరులైన గురువులతో కలసి కోట్ల రూపాయ విలువైన భూమిని మోసపూరితంగా అజ్ఞాత వ్యక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు .కలసికట్టుగా పోరాడి ఈ దురాక్రమణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Also Read : దమ్మపేటలో పొంగులేటి పర్యటన

అంతేకాక ఇంకా ఎన్నో అక్రమాలు గత 25 సం॥లుగా జరిగిన కో ” రూపాయల అవకతవకలు మరియు భూములు క్రయ విక్రయాలకు సంబంధించిన అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు . ఖమ్మం రూరల్ మండలం , నాయుడుపేటలో గల ది డయోసిస్ ఆఫ్ ఖమ్మం సొసైటీకి సంబంధించిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తిలను అక్రమంగా అమ్మినవారిపై కొనుగోలు చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో గుడిబండ్ల పవన్ కుమార్ , కనకం ఎల్లయ్య (కె.వి. రత్నం) , మొగపోతుల జయరాజు , సామేలు , ఏసు , రత్నయ్య , ప్రవీణ్ , బాబూరావు మరియు విశ్వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube