సావిత్రిబాయి పూలే జయంతి అధికారికంగా నిర్వహించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26 వనపర్తి : భారతీయ సంఘ సంస్కర్త మొదటి మహిళా ఉపాధ్యాయులు రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తకోటలో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ కమిటీల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పుణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించిదని ఆమె తెలిపారు. ఆధునిక భారతదేశంలో పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి కేంద్ర ప్రభుత్వం గుర్తించే ఆమె 191 వ జయంతి సందర్భంగా జనవరి మూడో తేదీన ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మధులత, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షురాలు హరతి, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ గౌడ్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, అడ్డాకుల మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మదనపూర్ మండల అధ్యక్షుడు మహీధర్ సీసీ కుంట మండల అధ్యక్షుడు చంద్రకాంత్, అశోక్, సంధ్యారాణి, రవి తదితరులు పాల్గొన్నారు.

Savitribai Poole Jayanti Should be officially celebrated.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube