ఘనంగా సాయుధ పోరాట వారోత్సవాలు

ఘనంగా సాయుధ పోరాట వారోత్సవాలు

2
TMedia (Telugu News) :

ఘనంగా సాయుధ పోరాట వారోత్సవాలు

టీ మీడియా,సెప్టెంబర్16,రామకృష్ణాపూర్: శుక్రవారం తెలంగాణా సాయుధ పోరాట వార్షికోత్సవాలు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ లో కమ్యూనిస్టు నాయకులు ఘనంగా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సీపీఐ పార్టీ కార్యాలయం లో కలవెన శంకర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ నాయకులు పట్టణం లోని ముఖ్య కూడాళ్ళ గుండా ర్యాలీ నిర్వహించారు.రామలయం లో చౌరస్తా లో రామడుగు లక్ష్మణ్, సూపర్ బజార్ లో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్ప కాయల లింగయ్య, రాజీవ్ చౌక్ లో పట్టణ కార్యదర్శి మిట్ట పెల్లి శ్రీనివాస్, ఆర్.కె.1స్థూపం వద్ద ఎండీ అక్బర్ అలీ,జ్యోతి నగర్ లో నక్క వెంకటస్వామి, రైల్వే స్టేషన్ లో మహిళ సమాఖ్య పట్టణ కార్యదర్శి గాజుల మనెమ్మ లు జెండాల ను ఆవిష్కరించారు.

Also Read : సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం

అనంతం కలవెన శంకర్,రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్ట పెల్లి శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భుక్తి కోసం జరిగిందని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వనం సత్యనారాయణ,కాదండీ సాంబయ్య, మెరుగు రాజేశం, పెండ్యాల కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube