భారీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల పెంపు

భారీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల పెంపు

1
TMedia (Telugu News) :

భారీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల పెంపు

టి మీడియా, మే 11,ముంబై: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను సవరించింది. రూ.2 కోట్లు ఆపైన చేసే డిపాజిట్లకు వడ్డీరేటును 40-90 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డిపాజిట్లు, రెన్యూవళ్లకు ఈ పెంచిన రేట్లువర్తించనున్నాయి.
-ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంలో ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటు ను 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Also Read : అస‌ని ఎఫెక్ట్‌

అందుకనుగుణంగానే తాజా డిపాజిట్‌ రేట్లను పెంచినట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత బంధన్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా డిపాజిట్‌ రేట్లను పెంచాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ సైతం రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై వడ్డీరేట్లను రు10 బేసిస్‌ పాయింట్లు పెంచింది.2 కోట్లు.. ఆపైన చేసే డిపాజిట్లపై ఎస్‌బీఐ కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube