ఇంజనీరింగ్ కళాశాలల్లో అగ్రగామి ఖమ్మం ఎస్. బి. ఐ.టి.

విద్యార్థుల సక్సేమీట్ లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

1
TMedia (Telugu News) :

ఇంజనీరింగ్ కళాశాలల్లో అగ్రగామి ఖమ్మం ఎస్. బి. ఐ.టి.

-విద్యార్థుల సక్సేమీట్ లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టి మీడియా,మే16,ఖమ్మం:
ఇంజనీరింగ్ కళాశాలల్లో ఖమ్మం ఎస్.బి. ఐ.టి.కళాశాల విద్యార్ధులకు విద్య ను అందిస్తూ వారికి పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం లో ఆ కళాశాల అగ్రగామిగా నిలుస్తుందని,దీనికి ఆయా కంపెనీలలో కళాశాల విద్యార్థులు సంపాదించిన ఉద్యోగాలు నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.పలు బహుళ జాతి కంపెనీల్లో ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 225మంది ఉద్యోగాలు సాధించినందుకు కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.జిల్లాలో గతంలో ఎన్నో కళాశాలల విద్యార్ధులు సాధించలేని ఘనత ను ఈ కళాశాల విద్యార్థులు సాధించడం ముదావహం అన్నారు.

Also Read : రూ.7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు.

దీనికి కారణమైన అధ్యాపకుల ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల చైర్మన్ కృష్ణ విద్యారంగంలో అపారమైన అనుభవం గల వ్యక్తి గా ఆయన పేర్కొన్నారు.తన విద్యాసంస్థలలో విద్య నభ్యసించిన పలువురు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు ఈ జిల్లా వాస్తవ్యుడు ని అయిన తనకు తెలుసునన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న ఎస్.బి. ఐ.టి.భవిష్యత్ లో మరింత మంది విద్యార్ధులను ఉన్నత శిఖరాలు అధిరోహించెలా చేసి దేశానికి ఉపయోగ పడే పౌ రులుగా తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం ఐటి రంగ ప్రాముఖ్య త ను,ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి వివరించారుఅదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి కృష్ణ తో పాటు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెట్ ధాత్రీ లకుతినిపించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రూపొందించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు.ఇందులో ప్లేస్ మెంట్ సాధించిన విద్యార్థులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు సాధించారాన్న పూర్తి వివరాలు పొందు పరిచారు.తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై న అజయ్ కుమార్ కు కృష్ణ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.చివరిగా ఆయన్ను శాలువాతో గౌరవప్రదంగా సన్మానించారు…

Also Read : డీజీపీకి స్వాగతం పలికిన ఎస్పీ

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ ఎం.ఎల్. సి.బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం కార్పోరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ డి. లక్ష్మి ప్రసన్న,టీఆర్ఎస్ పార్టీ నగర అద్యక్షులుపగడాల నాగరాజు,మాజీ అధ్యక్షులు కమర్తపు మురళీ,స్థానిక కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మీ జశ్వంత్,36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, సుడా డైరెక్టర్లు,వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు, అధికారులు,స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube