నేడే SBIT సావిష్కర్-22
-హాజరుకానున్న పలు రంగాల ప్రముఖులు
టి మీడియా,ఏప్రిల్ 27,ఖమ్మం :నగరంలోని పాకబండ బజార్ ప్రాంతంలో గల ఎస్ బి ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో సావిష్కర్-22 నేషనల్ టెక్నికల్ సింఫోజియం, కళాశాల వార్షిక దినోత్సవం ను ఈ నెల 28, 29 తేదిలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ఛైర్మన్ జి. కృష్ణ తెలిపారు. ఈ టెక్నికల్ సింపోజియం విద్యార్థులలో ప్రతిభను వెలికితీయటానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల పాటు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు ఉదయం ఖమ్మం మున్సిపల్ ర్పోరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సాయంత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొంటారని తెలిపారు. రెండవ రోజు కళాశాల వార్షిక దినోత్సవంలో తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ నివాస్ పాల్గొంటారని వివరించారు. జాతీయ టెక్నికల్ సింఫోజియంకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలను అధ్యావకులను, విద్యార్థులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28 న పేపర్ ప్రజంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, ప్రాజెక్టాక్స్ఫో, క్యాడ్ డ్రాయింగ్. యంగ్ మేనేజర్ అవార్డు, జాయిన్ సెషన్, బ్లెండ్ కోడింగ్ లాంటి సాంకేతిక అంశాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం
29న కళాశాల వార్షిక దినోత్సవం నిర్వహించనున్నామని, దీనిలో భాగంగా గత సవంత్సర అకడమిక్ క్యాంపస్ కు బహుమతి ప్రధానం. కళాశాల వార్షిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటలపోటీల విజేతలకు బహుమతి ప్రధానం, 2021-22 విద్యాసంవత్సరంలో పలు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన సుమారు 200 మంది విద్యార్థులను అభినందిస్తూ మెమెంటోల ప్రధానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తల్లిదండ్రులు ఇప్పటి వరకు చూపిస్తున్న ఆదరాభిమానలను కొనసాగిస్తూ రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజేయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్టాండెంట్ డా॥ జి. ధాత్రి, ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్‌కుమార్, ఎకడమిక్ డైరెక్టర్స్ డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ జి. సుభాష్ చందర్, జి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube