వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను బొందపెడతాం

వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను బొందపెడతాం

1
TMedia (Telugu News) :

వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను బొందపెడతాం

టీ మీడియా, ఆగస్ట్ 8, వనపర్తి బ్యూరో : ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను బొంద పెడతాం అని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు హెచ్చరించారు.
సోమవారం తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను విభజిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అదే విధంగా స్వార్థ రాజకీయాల కోసం దళితులను విభజించి పాలించే విధంగా బిజెపి అనుసరిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధం అని కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం పదేపదే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకి తీసుకురావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Also Read : చెరువులో గుర్తుతెలియని మగ శవం లభ్యం

వర్గీకరణ పేరుతో దళితులకు మద్దతు పలుకుతున్న రాజకీయ నాయకులను రాబోవు ఎన్నికలో మాలలు తగిన బుద్ధి చెప్తారని అదే విధంగా అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు అని మొట్టికాయలు వేసిన కూడా రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి పార్టీ అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని విడిచిపెట్టి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి అన్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు అతి త్వరలో బిజెపి నాయకుల ఇళ్లను ,బిజెపి కార్యాలయంలో ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం రాఘవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్, జిల్లా కార్యదర్శి బైండ్ల వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి పత్తి వెంకటేష్, బాలరాజు, నియోజకవర్గ అధ్యక్షులు తోళ్లమాసయ్య, మండల అధ్యక్షులు కథలయ్య, పట్టణ అధ్యక్షుడు సాతార్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube