ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 1 వనపర్తి వచ్చే శీతాకాల సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టి ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దమందడి రావూస్ జూనియర్ కళాశాల వనపర్తి మాదిగ విద్యార్థులు చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలు ఎంఎస్ఎఫ్ కొమ్ము చెన్నకేశవులు మాదిగ, రాజేష్ మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మాదిగ విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి రాజీ లేకుండా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. వర్గీకరణ లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగ రంగాల్లో విద్యార్థిని విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. మాదిగలను నేనే ఉద్దరిస్తానని అని గొప్పలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షంను ప్రధాని వద్దకు తీసుకెళ్లడంలో మోసం చేశారని అన్నారు. అలాగే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ మాట తప్పిందని అన్నారు.

దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకుంటున్న బిజెపి వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని బిజెపి వర్గీకరణ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదో పునరాలోచన చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎస్ఎఫ్ వెంకట్ ,అజయ్ కుమార్, ఆనంద్, వెంకటేష్, మహేష్, భాస్కర్, రవి, ప్రకాష్, మాదిగ, మౌనిక, అర్చన ,లక్ష్మి, వెన్నెల, మాధివి, చరిత్ర, భారతి, పూజిత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube