పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 2 వనపర్తి : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న చలో ఢిల్లీ మాదిగల విద్యార్థులు జాతీయ సభ విజయవంతం చేయాలని గురువారం రాజనగరం రాజేష్ మాదిగ వనపర్తి ఇన్ఛార్జ్ చెన్నకేశవులు మాదిగ జూనియర్ కళాశాల వనపర్తి లో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జరుగుతున్న సాంఘిక న్యాయ సంగ్రామంలో జాతిని విజేతగా నిలబెట్టడానికి నడుం బిగించాల్సిన సమయం వచ్చింది. 27 ఏళ్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం మాదిగల జీవితాల్లో ఆత్మ గౌరవం పెంచింది. సామాజిక చైతన్యాన్ని ఇచ్చింది. మనుషులను పోరాడే శక్తులుగా దండోరా ఉద్యమం తయారు చేసింది. డప్పుల దరువులతో గ్రామాలను మేల్కొల్పిన మన తల్లిదండ్రులు రాజధాని నడిబొడ్డున దండోరా వేసి సామాజిక న్యాయం వినిపించారు. మన ఉద్యమ ఆకాంక్షలను వినిపించారు.

కారం రొట్టెలు తిని చలిలో వణికి వానలో తడిసి ఎండలో ఎడి మన కోసం ఉద్యమాన్ని నిర్మించి ఈనాటివరకు నిలబెట్టారు. 15 శాతం రిజర్వేషన్లు ఫలితాలను అప్పటికి దాదాపు 50 సంవత్సరాల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన వారే 10 నుండి 12 శాతానికి పైగా విద్యా ఉద్యోగ రంగాల్లో అనుభవించారు. అన్ని రంగాలలో మాదిగలు వెనకబడి ఉన్నారు. కావున ఎస్సి రిజర్వేషన్ల ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది. పార్లమెంట్లో చట్టబద్ధత కోసం లక్షలాది మంది ఢిల్లీ కి తరలి ఉద్యమిద్దాం అని పిలుపునిచ్చారు.

Rajesh Madiga Vanaparthi in-charge Chennakesavulu Madiga Junior College, Vanaparthi on Thursday distributed leaflets .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube