అన్ని రంగాల్లో దళితులు వెనుకబడి ఉన్నారు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 3 వనపర్తి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న చలో ఢిల్లీ మాదిగల విద్యార్థుల జాతీయ మహాసభలు విజయవంతం చేద్దామని వనపర్తి జిల్లా సీనియర్ నాయకులు చెన్నకేశవులు అన్నారు. శుక్రవారం రోజు వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. డబ్బుల దరువులతో గ్రామాలను మెలుకొల్పిన మన తల్లిదండ్రులు రాజధాని నడిబొడ్డున దండోరా వేసి సామాజిక న్యాయం వినిపించారు. మన ఉద్యమ ఆకాంక్షలను నడిపించారు. కారం రొట్టెలు తిని చలిలో వణికి వానలో తడిసి ఎండలో ఎడి మన కోసం ఉద్యమాన్ని నిర్మించి ఈనాటి వరకు నిలబెట్టారు. 15 శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలను అప్పటికే దాదాపు 50 సంవత్సరాల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన వారే 10 నుండి 12 శాతానికి పైగా విద్యా ఉద్యోగ రంగాల్లో అనుభవించారు. సంక్షేమ మరియు రాజకీయ రంగం కంటే ఎక్కువ ఫలితాలను అనుభవించారు. దానితో అన్ని రంగాల్లో మాదిగలు వెనుకబడి పోయారు.

పైన పేర్కొన్న విధంగా ఎస్సి రిజర్వేషన్ల ద్వారానే సమన్యాయం జరుగుతుంది. పార్లమెంట్లో చట్టబద్ధత కోసం లక్షలాది మంది ఢిల్లీకి తరలి ఉద్యమిద్దాం ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు వెంకట్, విద్యార్థులు రవి, శివ, పవన్, గణేష్, శంకర్ ,యాదగిరి, కరుణాకర్, పవన్, శివ, యాదగిరి, మహేశ్వరి, దీపిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube