ఎస్సీఎస్టీ నూతన కమిటీని ఏర్పాటు చేయాలి

ఎస్సీఎస్టీ నూతన కమిటీని ఏర్పాటు చేయాలి

1
TMedia (Telugu News) :

ఎస్సీఎస్టీ నూతన కమిటీని ఏర్పాటు చేయాలి

టీ మీడియా, ఏప్రిల్ 28, వనపర్తి, బ్యూరో : ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని రద్దు చేయాలని ప్రస్తుత కమిటీ యొక్క కాలపరిమితి ముగియనున్నది కాబట్టి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి మరొకసారి నూతన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని జిల్లాస్థాయిలో, డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షిస్తూ చట్టాన్ని సరిగా అమలు చేయాలని బహుజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిరంజీవి, మహనీయుల ఉత్సవాల కమిటీ జిల్లా చైర్మన్ ఎడవల్లి వీరప్ప జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Also Read : సీఐ వివాదంపై స్పందించిన మహేందర్ రెడ్డి..

ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ 2017లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒక కాలపరిమితి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కొత్త కమిటీని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. జీవో నెంబర్ 63 ప్రకారం ఎస్సీఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ యొక్క కాలపరిమితి ముగియనున్న అందువల్ల కొత్త కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube