జల్ జీవన్ మిషన్‌లో స్కామ్.. 25 చోట్ల ఈడీ సోదాలు
జల్ జీవన్ మిషన్‌లో స్కామ్.. 25 చోట్ల ఈడీ సోదాలు
జల్ జీవన్ మిషన్‌లో స్కామ్.. 25 చోట్ల ఈడీ సోదాలు
టీ మీడియా, నవంబర్ 3, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో జల్ జీవిన్ మిషన్‌లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 25 ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లోనూ ఈడీ సోదాలు చేపడుతోంది. జైపూర్‌తో పాటు దౌసా పట్టణాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పీహెచ్ఈ శాఖలోని అదనపు ముఖ్య కార్యదర్శి సుబోద్ అగర్వాల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మనీల్యాండరింగ్ స్కామ్‌తో లింకున్న ఇతర అధికారుల ఇండ్లల్లోనూ సోదాలు చేపడుతున్నారు. సెప్టెంబర్ నెలలో కూడా ఈడీ ఇదే తరహా తనిఖీలు చేసింది. శ్రీ శ్యాం ట్యూబ్‌వెల్ కంపెనీ ఓనర్ పద్మచాంద్ జైన్, శ్రీ గణపతి ట్యూబ్‌వెల్ కంపెనీ ఓనర్ మహేశ్ మిట్టల్.. పీహెచ్ఈడీ ప్రాజెక్టు పనుల కోసం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : పేదలకు భరోసా బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో
దీనిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అక్రమ రీతిలో టెండ్లు, బిల్లులు పొందేందుకు వాళ్లు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్ఈడీ కాంట్రాక్టు పనుల కోసం హర్యానా నుంచి దొంగలించిన వస్తువులను వాడినట్లు తేలింది. పనులు పూర్తి అయినట్లు నకిలీ లెటర్స్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube