నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ

నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ

1
TMedia (Telugu News) :

నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ

టీ మీడియా,సెప్టెంబర్ 14, గోదావరిఖని : రామగుండం మండలం అల్లూరు 18వ డివిజన్ లో గల ఎంపియూపిఎస్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు వారి విద్యాభ్యాస నిమిత్తం సంవత్సరకాలం సరిపడా విద్యా సామాగ్రి తో కూడిన స్కూల్ కిట్స్ ని మరియు డ్రస్సులను అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నాగరాజు విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ….
అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లల ఆశ్రమ నిర్వహణ కాకుండా, సహాయం అన్న పేద వారందరికీ వారి సహాయం అందిస్తూ, నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసన కొరకై “గిఫ్ట్ ఏ స్మైల్ ” పేరిట ఈ కార్యక్రమం నిర్వహించినట్టు, ఇప్పటికీ సుమారు 450 స్కూల్ కిట్లను నిరుపేద విద్యార్థులకు అందజేసినట్టు ఆయన తెలిపారు.

Also Read : గ్యాస్ ప్రమాద బాధితులకు పరిహారం

అదేవిధంగా రాబోయే రోజుల్లో అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలను పాఠశాలలో చదివే నిరుపేద పిల్లల కోసం నిర్వహిస్తామని సంస్థ నిర్వాహకులు నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజ రెడ్డి,స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ బాదే క్రాంతి కుమార్, పాఠశాల హెడ్మాస్టర్ గోపికృష్ణ,టీచర్స్ రాజేశ్వరి, మల్లేశ్వరి,పద్మావతి,వివిధ సంఘాల బాధ్యులు గుండెటి రాజేష్ చక్రపాణి వెంకటేష్ రాజు,అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు కరణ్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube