బడి వేళలను తగ్గించారు
టీ మీడియా, మార్చి 31,హైదరాబాద్: రాగల నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల బడి వేళలను తగ్గించింది. రేపట్నుంచి ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కుదించిన వేళలు ఏప్రిల్ 6 వరకు పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read : 15 ఎకరాల్లో కలెక్టరేట్ సముదాయాలు నిర్మించాలి : ఏపీ సీఎం జగన్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube