పాఠశాలను అభివృద్ధి చేయాలి

పాఠశాలను అభివృద్ధి చేయాలి

0
TMedia (Telugu News) :

పాఠశాలను అభివృద్ధి చేయాలి

టీ మీడియా, మార్చి 17, వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్, పిఎస్ ప్రాథమిక పాఠశాల సమావేశం బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అభివృద్ధిలో తీర్చిదిద్దాలన్నారు. గ్రామంలోని పెద్దలు ప్రాథమిక పాఠశాలకు వేరేచోట నిర్మించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. పూర్వ విద్యార్థులను, ఎన్నారైలను కలిసి పాఠశాలలకు విరాళాలు సేకరించాలని పిఎస్ పాఠశాలకు స్థలం స్వీకరించాలని సర్పంచ్ సరిత కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత, తిరుపతిరెడ్డి, గ్రామ పెద్దలు శేఖర్ గౌడ్ ,ఎస్ఎంసి చైర్మన్ పద్మ, పి.ఎస్. హెచ్ఎం.లక్ష్మి, తిరుపతి రెడ్డి, ఎస్ఎంసి సభ్యులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : వైపు లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మార్కెట్ చైర్మన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube