నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు

నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు

1
TMedia (Telugu News) :

నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు

 

టీ మీడియా, అక్టోబర్ 27, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం బిజెపి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది.

Also Read : టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

ఇట్టి ప్రయత్నాన్ని మా టిఆర్ఎస్ గౌరవ ఎమ్మెల్యేలు, బిజెపి పెద్దలకు పెద్ద గుణపాఠం నేర్పుతూ వారి యొక్క అరాచకాలను దుర్బుదిని యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా భారతదేశం సిగ్గుపడేలా బిజెపి ప్రభుత్వం నిసిగ్గుగా ప్రభుత్వాలను పడగొస్తూ ప్రభుత్వాలను కూల దోస్తు రాక్షస ఆనందం పొందుతూ ఈ దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను,నిరసనగా , ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది .కనుక టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్, గొల్ల కాపుల సంఘం అధ్యక్షుడు, వివిధ హోదాలో ఉన్న నాయకులు నాయకులు యువత, మహిళలు అందరూ పాల్గొని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube