సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

1
TMedia (Telugu News) :

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
టీ మీడియా, జూలై 26 బోయినపల్లి ప్రతినిధి ; రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం బోయినపల్లి గ్రామం మానువాడ మరియు మల్లాపూర్ గ్రామంలో ఈరోజు కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందరు కూడా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా కోవిడ్ మహమ్మారి మళ్ళీ పంజా విసురుతుంది కావున ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ యధావిధిగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు.

 

Also Read : వికలాంగుల వేదిక అధ్యక్షునీ ఎన్నిక

 

ఆయా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రావడం వల్ల రక్తనామునలు సేకరించి స్థానిక హాస్పిటల్ కి పంపించడం జరిగింది అందరూ ఈ వ్యాధుల పట్ల వేడి నీటి తాగాలని పరిశుభ్రంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పుష్పలత,వినోద ,ఆశ వర్కర్ మంజుల, శారద ,పంచాయతీ సెక్రెటరీ లు మహేందర్ రెడ్డి మరియు రాజ శ్రీ ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube