సికింద్రాబాద్ కాల్పుల్లో ఒకరు మృతి
-మృతుడు వరంగల్ కి చెందిన దామోదర్
-పలు రైళ్లు దారిమల్లింపు
-కొనసాగుతున్న ఆందోళన
టి మీడియా, జూన్ 17,సికింద్రాబాద్: రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది.
Also Read : అందుకే ఎస్ఐ భుజం పట్టుకున్నా: రేణుకా
చేసేది ఏమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపారు.
. ఈ కాల్పుల్లో కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే కాసేపటి క్రితమే ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.అతను వరంగల్ కి చెందిన దామోదర్ గా గుర్తించారు.
Also Read : రణరంగంగా సికింద్రాబాద్ స్టేషన్
ఘటనతో అప్రమత్తంఅయిన రైల్వే అధికారులు పలు రైళ్లను దారి మళ్లించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నంబర్ ఫ్లాంట్ ఫాం దగ్గర ఓ యువకుడు పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం అందుతోంది. ఇక మరికొందరికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube