రణరంగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌

రణరంగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌

2
TMedia (Telugu News) :

టి మీడియా, జూన్ 17,సికింద్రాబాద్‌: స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో మాడిమసయ్యాయి. పార్సిల్‌ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రైల్వేట్రాక్‌, ప్లాట్‌ఫామ్‌లు గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Also Read  : ముగిసిన 95 వ రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారులకు గాయాలయ్యాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌‌ రక్తసిక్తంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతున్నారు.సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ చేస్తుందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది.

రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. మూడు ప్లాట్‌ఫామ్‌లలో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. 20 బైక్‌లకు నిప్పు పెట్టారు.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద విద్యార్థులు బైఠాయించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. ప్యాసింజర్‌ రైలు, పార్మీల్‌ బోగీలకు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు.రైళ్లపై రాళ్లు విసరడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Also Read : పెద్దబాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

 

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ఇక నిరసనకారుల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube