సెకండ్‌ హ్యాండ్‌ అంటే మజాక్‌ కాదు!

సెకండ్‌ హ్యాండ్‌ అంటే మజాక్‌ కాదు!

1
TMedia (Telugu News) :

సెకండ్‌ హ్యాండ్‌ అంటే మజాక్‌ కాదు!
టి మీడియా,మే10,హైద‌రాబాద్ : దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ ఊహించని వేగంతో విస్తరిస్తోంది. కన్సల్టింగ్‌ ఫర్మ్‌ రెడ్‌సీర్‌ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 26 నాటికి దేశీయంగా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. ఇక ఫోన​‍్లతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ విలువ 16 శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 11 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను చేరుకుంటుందని అంచనా.వాడేసిన ఫోన్లను రిఫర్బిష్‌డ్‌ చేసి రీకామర్స్‌ పేరుతో పలు సైట్లు విక్రయిస్తున్నాయి. అందుబాటు ధరలో ఫోన్లు వస్తుండటంతో వీటిని కొనేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం ఫస్ట్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ విలువ ఇండియాలో 15 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇదే సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ విలువ కూడా భారీగానే ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య దేశంలో 55 కోట్లపైకి చేరుకుంది.

Also Read : నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

రీకామర్స్‌ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని రెడ్‌సీర్‌ చెబుతోంది. అందులో ముఖ్యమైనవి సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల నాణ్యత కాగా కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి తీసుకునే సమయం రెండోవదిగా నిలుస్తోంది. వీటితో పాటు ధరల నిర్ణయించే విషయంలో కూడా పారదర్శకత ఉండటం లేదు. ఈ నాణ్యత, ధరల విషయంలో మెరుగుపడితే సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ అంచనా వేస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube