ప్రజా సమస్యలపై సిపిఎం ఉద్యమిస్తాం

0
TMedia (Telugu News) :

-సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య

టీ మీడియా ,నవంబర్28,కరకగూడెం:

ప్రజా సమస్యలపై ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కనకయ్య పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రంలో పార్టీ ద్వితీయ మహాసభ కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ గౌని నరేష్ ప్రాంగణంలో జరిగింది.ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… మండలంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కోడి భూములకు పట్టాలు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పింఛన్లు పెండింగ్లో ఉన్న వాటిని తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.వరి పంట కొనుగోలు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజలకు మాయమాటలు చెప్పి పెడుతున్నారని పట్టార.పోడు భూముల పట్టాలు శాటిలైట్ సర్వే పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ…ప్రజలలో అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ప్రారంభమవుతుందని అవుతుందనిఎర్రజెండా ప్రజా పోరాటాలు ఉదృతం చేయాలని తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం ఇందుకు ఉదాహరణ అని వారు తెలియజేశారు.ప్రజా పోరాటాలు ఉధృతంగా తీసుకొచ్చేందుకు సన్నద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సాంబశివరావు,కాంతారావు సత్యం నరసింహారావు,శంకరయ్య రామ్ తదితరులు పాల్గొన్నారు.

CPM district secretary kanakayya called on the people to unite and fight on public issues.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube