సికింద్రాబాద్‌ పరిధిలో 71 రైళ్లు రద్దు

-తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు

2
TMedia (Telugu News) :

సికింద్రాబాద్‌ పరిధిలో 71 రైళ్లు రద్దు

-తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
టి మీడియా,జూన్ 17, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. సికింద్రాబాద్‌ పరిధిలో 71 రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, హైదరాబాద్‌-షాలిపూర్‌ ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. స్టేషన్లలోకి పోలీసులు ఎవరీని అనుమతించడంలేదు.

Also Read : జీడికే 2ఏ గనిపై స్వచ్ పక్వాడా

రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. మూడు రైళ్లను తగులబెట్టారు. పార్సిళ్లను రైలు పట్టాలపై వేసి కాల్చివేశారు. పలు రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులను పగులగొట్టారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు లూటీ చేశారు.

Also Read : అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం

దీంతో ఆదోంళనకారులను అదుపుచేయడానికి రైల్వే పోలీసులు 15 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందులో గాయపడిన ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతిచెందిన వ్యక్తిని నిర్మల్‌ జిల్లాకు చెందిన దామోదర్‌ కురేషియాగా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు వెళ్లి అక్కడినుంచి స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube