పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలకు కారణం నిరుద్యోగం

- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

0
TMedia (Telugu News) :

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలకు కారణం నిరుద్యోగం

– కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

టీ మీడియా, డిసెంబర్ 16, న్యూఢిల్లీ : ఢిల్లీలోని భారత పార్లమెంట్‌లో భారీ భద్రతాలోపం బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్‌లో ఇద్దరు ఆగంతకులు లోక్‌సభ లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. కలర్‌ స్మోక్‌ వదిలి ఎంపీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్లమెంట్‌ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తాజాగా స్పందించారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి కారణం నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ‘ఇలా ఎందుకు జరిగింది? దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదు. ఈ కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు.

Also Read : రేవంత్ సారూ.. పాత‌బ‌స్తీ అభివృద్ధిపై దృష్టి సారించండి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube