విత్తనాల నిల్వవివరాలు తెలుగులో ప్రదర్శించాలి

విత్తనాల నిల్వవివరాలు తెలుగులో ప్రదర్శించాలి

0
TMedia (Telugu News) :

 

coloctor visitings

 విత్తనాల నిల్వవివరాలు తెలుగులో ప్రదర్శించాలి                                                                    ఖమ్మం :విత్తన విక్రయ షాపులు, తమ షాపులో ఉన్న విత్తనాలు, నిల్వ వివరాలు రైతులకు అర్థం అయ్యేలా తెలుగులో ప్రదర్శించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం గాంధీ చౌక్, బర్మా షెల్ రోడ్ లోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ. రేటు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి, దుకాణదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఏ ఏ ప్రాంతాల నుండి వస్తున్నది, ఏ ఏ రకాలు అడుగుతుంది అడిగి తెలుసుకున్నారు. ఇతర షాపులకు అమ్మినది, రైతులకు నేరుగా అమ్మినది రిజిషర్లు విడి విడిగా నిర్వహించాలన్నారు. షాపుల వద్ద విత్తన కొనుగోలుకు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చింది, ఏ పంట సాగు చేస్తున్నది, గత సీజన్ లో ఏ పంట సాగు చేసింది, ఏ రకం విత్తనాలు కొంటున్నది, షాపు వారు ఎం.ఆర్.పి. రేటుపై ఇస్తున్నారా, అదనంగా అడుగుతున్నారా అడిగి తెలుసుకున్నారు.

ALSO READ:ఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube