రైతులను మోసం చేస్తున్న సీడ్స్ కంపెనీలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్ 8,కరకగూడెం:

కరకగూడెం మండల వ్యాప్తంగా సీడ్స్ కంపెనీలు జోరుగా మధ్యవర్తి వలన రైతులను మోసం చేస్తారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చందా మధు అన్నారు.
వివిధ గ్రామాల సంబంధించిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ…సీడ్స్ కంపెనీలు ఏజెన్సీ ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకొని,మధ్యవర్తిత్వం వహిస్తున్న కంపెనీ సూపర్ వైజర్ రైతులను మోసం చేయడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు.

రైతులకు ఈఎస్ భీమా తక్కువ దిగుబడి వస్తే 45000గాను 39000రూ లకు చెల్లిస్తున్నారని,అందుకు ఎకరానికి 5-8 వస్తుందని చెప్పారు.కానీ దిగుబడి తక్కువగా రావడం వలన రైతులు నష్టపోతున్నారని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులకు మంచి కంపెనీ నాణ్యమైన సీడ్స్ ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చందా ప్రసాద్,చందా వెంకటనారాయణ,చర్ప పాపారావు,నారాయణ,బాబురావు, రామారావుపాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube