శనగకుంటలో సీతక్క పర్యటన

అగ్నిప్రమాద బాధితులకు ఓదార్పు

1
TMedia (Telugu News) :

శనగకుంటలో సీతక్క పర్యటన

అగ్నిప్రమాద బాధితులకు ఓదార్పు

టీ మీడియా,ఏప్రిల్ 30,ములుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం ఉదయం జిల్లాలోని మంగపేట మండలం శనగకుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఓదార్చారు.బాధితులకు తక్షణసాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు గిన్నెలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు.

Also Read : కార్పొరేటర్ బి.జి. క్లైమెంట్ జన్మదిన వేడుకలు

మంగపేట మండలం శనగకుంటలో గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదానికి ఊరు మొత్తం కాలిబూడిదైన విషయం తెలిసిందే. దాదాపు 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆదివాసి గూడెం వాసులు చెల్లాచెదురయ్యారు. పిల్లాపాపలతో పక్కూరిలో తలదాచుకున్నారు. నిలువనీడ లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube