అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

జనసంద్రంగా మారిన భద్రాద్రి

1
TMedia (Telugu News) :

అంత రామ మయం
-అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

-జనసంద్రంగా మారిన భద్రాద్రి

-పట్టు వస్త్రాలు అంద జేసిన మంత్రులు

టీ మీడియా, ఏప్రిల్ 10, భద్రాచలం:

భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా మహా అద్భుతంగా జరిగింది. వేకువజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం చిరుత అంతరాలయంలొ ద్రవ మూర్తులకు ఏకాంతంగా కల్యాణం జరిపించారు. తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అందంగా ముస్తాబు చేసి పల్లకిపై ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. భజంత్రీలు సన్నాయిమేళం నడుమ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ భక్తుల జయజయ ధ్వానాలు చేయగా స్వామివారు కల్యాణ రాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకస్వాములు మిథిలా ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు రామదాసు చేయించిన బంగారు ఆభరణాలు శ్రీసీతారామచంద్ర లక్ష్మణ స్వామి వారికి ధరింపజేశి అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు.

Also Read : నేడు రాములోరి పెళ్లి -సర్వం సిద్ధం చేసిన అధికారులు

మధ్యాహ్నం 12:30 కు అభిజిత్ లగ్నమున్నా స్వామివారి కల్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. రెండేళ్ల తదుపరి భక్తుల సమక్షంలో ఆడంబరంగా స్వామి వారి కళ్యాణం జరగడం తో కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు ఆనందానికి లోనయ్యారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ఈ వేడుకకు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు స్వామివారి కల్యాణంలొ అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube