రాజస్థాన్‌లో రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ‘ఉచితాలు’ స్వాధీనం
రాజస్థాన్‌లో రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ‘ఉచితాలు’ స్వాధీనం
రాజస్థాన్‌లో రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ‘ఉచితాలు’ స్వాధీనం
టీ మీడియా, అక్టోబర్ 28, జైపూర్ : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆభరణాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి రాజస్థాన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐజీ వికాస్ కుమార్ నేతృత్వంలో 12 మంది అధికారుల బృందాలతో ‘స్టోర్మ్ క్లబ్’ను ఏర్పాటు చేశారు. కాగా, రాజస్థాన్ వ్యాప్తంగా ఎన్నికలపై కట్టుదిట్టమైన నిఘా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లు ప్రభావితం కాకుండా చూసేందుకు ఈ పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు రూ. 214 కోట్ల మేర ఎన్నికల ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో రూ. 25 కోట్ల డబ్బు, రూ. 20 కోట్ల విలువైన మద్యం, రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని అన్నారు. వీటికి సంబంధించి పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read : ముఖేశ్ అంబానీకి బెదిరింపు లేఖ
మరోవైపు రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్, అలాగే అక్రమంగా నిల్వ చేసిన ఆయుధాలు, పెట్రోల్, డీజిల్, ఎరువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ మోనాకో కింద రాజస్థాన్ వ్యాప్తంగా 650 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube