లక్షా 90 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లను పట్టివేత

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్26,మధిర:

ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గుట్కా ప్యాకెట్లు విక్రయాలపై కట్టడి చేయాలని ఆదేశించటం తో మధిర సి ఐ మురళి నేతృత్వంలో మధిర సర్కిల్ పరిధిలో 10 టిమ్స్ గా పోలీసులు బృందం ఏర్పడి మంగళవారం పాన్ షాపుల్లో చిల్లర దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న షాపుల్లో సిఐ మురళి స్వతహాగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనకల్లు మండలం ముష్టి కుంట గ్రామంలో లక్షా 90 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మురళి పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి, గుట్కా ప్యాకెట్లు అమ్మకాలు చేపడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ మురళీ పేర్కొన్నారు. ఈ తనిఖీలలో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్, రూరల్ ఎస్ ఐ రమేష్ కుమార్ ట్రైనీ ఎస్ఐ షకీ ర్, బోనకల్ ఎర్రుపాలెం ఎస్ఐలు పాల్గొన్నారు.

Seizure of gutka packets worth Rs 90 lakh.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube