ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 24 వనపర్తి : వనపర్తి పట్టణంలోని స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు స్వయంగా తరగతిలో పాఠ్యాంశాలను బోధించారు. నిస్వార్ధంగా విద్యను పంచే గురువు పాత్రను పోషించినందుకు గర్వంగా ఉందని విద్యార్థులు ప్రతిభావం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్న ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన కార్యనిర్వాహకుడు వెంకటేష్ యాదవ్ ను పాఠశాల ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ అభినందించారని వ్యాయామ ఉపాధ్యాయులు దయానంద్ తెలిపారు.

The Local Brilliant School in Vanaparthi town celebrated its self-governance day.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube