నిప్పంటించుకున్న తల్లి, కొడుకు -ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

టి మీడియా, ఎప్రియల్ 16,కామారెడ్డి

1
TMedia (Telugu News) :

నిప్పంటించుకున్న తల్లి, కొడుకు -ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
-సిఐ తో సహా 7 గురి పై కేసు
టి మీడియా, ఎప్రియల్ 16,కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని న్యూమహారాజా లాడ్జిలో నిప్పంటించుకుని తల్లి, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామాయంపేటకు చెందిన గంగం పద్మ, సంతోష్‌లుగా గుర్తించారు. అయితే వేధింపుల వల్లే ఆత్మహత్యకు చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.వీడియోలో తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణమని తెలిపారు. గతంలో రామాయంపేటలో పనిచేసి ప్రస్తుతం తుంగతుర్తిలో పనిచేస్తున్న సీఐ నాగార్జునగౌడ్‌ సహా మరో ఆరుగురు ఆత్మహత్యకు కారణమంటూ గంగం సంతోష్‌, అతని తల్లి సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాధం, పట్టణ సీఐ నరేష్‌ పరిశీలించారు.సిఐ తో సహా మొత్తం ఏడుగురు పై కేసు నమోదు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube