టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 13
మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల నాగులగుంపు గ్రామంలో సియోను ప్రార్థన మందిరం లో ఆదివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా గ్రామంలో గల ప్రార్థనా మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.క్రైస్తవులు ప్రధాన పండుగ అయిన క్రిస్టమస్ పడగకు ముందుగా సెమ్మి క్రిస్టమస్ చేసుకోవటం ఆనవాయితి ఈ క్రమంలో పండువారిగూడెం, నాగులగుంపు, దిబ్బగూడెం, రామన్నగూడెం, అల్లిగూడెం గ్రామాలకు సంబంధించిన సంఘస్తులు విశ్వాసుల ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మందిరంలో కొవ్వొత్తుల వెలుగులతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రీస్తు గీతాలు ఆలపించారు అనంతరం చిన్న పిల్లల తో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు సున్నం సియోను కుమార్, పెలో షిప్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, యం విజయ్ కుమార్, నెహ్రూ,రాజు బెంజి దిలీప్ ప్రేమ్ పాల్, ఏలియా పేతురు జైపాల్,డేవిడ్,సియోన్ యూత్ సభ్యులు, మరియు సంఘ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.