టి మీడియా డిసెంబర్ 28 వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖపూర్ గ్రామంలో సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ల సమక్షంలో బాలామృతం పౌష్టికాహారం అం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ లక్ష్మమ్మ, వైస్ ఎంపీపీ కోట్ల బాలచంద్రారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఎల్లయ్య ,పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు రంజాన్ అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం బాలమృతం క్రమం తప్పకుండా రోజూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి వారు ఇచ్చే పోషకాహారం తీసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. అనంతరం గ్రామంలో పందుల బెడద నివారించాలని సర్పంచ్ మేకల రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామస్వామికి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో పందుల నుండి ఇళ్లలో నివసించే వారికి మరియు పంటపొలాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని యజమానులను పిలిపించి వారితో మాట్లాడి ప్రజలకు, పంట పొలాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవికుమార్ యాదవ్, ఉప సర్పంచ్ సంధ్య ఎల్లయ్య, వార్డు సభ్యులు రంజాన్, సంధ్యపాగ రమేష్ ,నాగరాజు, మన్యం, వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
