కర పత్రాలు ఆవిష్కరణ
టీ మీడియా,డిసెంబర్ 15,కరకగూడెం;
జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం ఆవిర్భావ సందర్భంగా భద్రాచలం డిసెంబర్ 27న జరిగే అటవీ హక్కుల చట్టం అమలు పై చర్చ,పోలవరం ముంపు ప్రాంతం ప్రజల పరిరక్షణ కొరకై ఆదివాసి జిఓ నెంబర్ 3 పునరుద్ధరణ,పెసా చట్టం పై సెమినార్ నిర్వహించడం జరుగుతుందని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కరకగూడెం మండలం జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి గోగ్గల రామకృష్ణ దొర, కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి పూనెం విష్ణుమూర్తి పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను కల్తీ సందీప్ ఊకే వెంకటేశ్వర్లు ఇర్ప బుచ్చయ్య ఆవిష్కరణ చేయడం జరిగింది.