సీనియర్ అడ్వొకేట్ మృతి

సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్

1
TMedia (Telugu News) :

సీనియర్ అడ్వొకేట్ మృతి
-సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్.

టి మీడియా,మే24 ,లక్షెట్టిపేట:పట్టణానికి చెందిన సీనియర్ అడ్వొకేట్ జెల్ల శంకరయ్య (60) మృతికి సంతాపంగా మంగళవారం లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. బార్ అసోసియేషన్ తరపున జెల్ల శంకరయ్య ఇంటికి వెళ్లి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read : ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి

లక్షెట్టిపేట్ లో శంకరయ్య అడ్వొకేట్ గా ప్రాక్టీసు ప్రారంభించి, ఎంతో మందికి న్యాయ సహాయం అందించడంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని లక్షెట్టిపేట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ కుమార్ కొనియాడారు. అనంతరం శంకరయ్య భౌతిక కాయానికి వందనం చేసి,నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఈ. రాజేశ్వర్ రావు, భూమ్ రెడ్డి,రాం రెడ్డి, కొమిరెడ్డి సత్తన్న, అక్కల శ్రీధర్,వేల్పుల సత్యం,తాజోద్దీన్, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube