కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విశ్వనాథన్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విశ్వనాథన్‌ కన్నుమూత

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విశ్వనాథన్‌ కన్నుమూత

టీ మీడియా, డిసెంబర్ 15, కేరళ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, కేరళ మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున కేరళలోని త్రిస్సూర్‌లోగల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు విశ్వనాథన్‌ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. విశ్వనాథన్‌.. 1977, 1980, 1987లో కున్నంకుళం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1987, 1991, 1996, 2001లో కొడకరా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1991-1994, 2004-2005 మధ్య అటవీ మరియు వన్యప్రాణుల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కొడకరా నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి సి రవీంద్రనాథ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాథన్‌ ఓ న్యాయవాది కూడా.

Also Read : య‌శోద ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్‌

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube