సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి

సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి

1
TMedia (Telugu News) :

సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి

టి మీడియా,జులై5,హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలోనూ అటు మీడియాలోనూ పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. చిత్రపరిశ్రమను ఒకదాని తర్వాత ఒకటి వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి మీనాభర్త మృతి చెందారు. ఇది మరువకముందే ఇప్పుడు మరో ప్రముఖుడు కన్నుమూశారు. దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రముఖ పత్రికలలో పని చేశారు. సుమారు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు.

 

Also Read : ఆర్ నారాయణ మూర్తి మాతృవియోగం..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని రచించారు. గుడిపూడి శ్రీహరి మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గత నవంబర్ లో శ్రీహరి భార్య లక్ష్మి మరణించారు. ఆ తరువాత నుంచి ఆయన బాగా కృంగిపోయి చాలా బలహీనంగా తయారయ్యారు. దాంతో ఇంటికే పరిమితమయిన శ్రీహరి, గత వారం ఇంట్లో జారి పడిపొవడం వల్ల తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. కానీ, ఆ తరువాత ఆరోగ్య సమస్యల వల్ల రాత్రి కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె వున్నారు. వారి కుమారుడు శ్రీ రామ్ స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. గుడిపూడి శ్రీహరికి 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం ‘పత్రికా రచన’ లో ‘కీర్తి పురస్కారాన్ని’ ప్రకటించింది. 1969 నుండి ‘ది హిందూ’ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి ఎన్నో తెలుగు చిత్రాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుందరయ్య విజ్ఞాన కళా మండపంనకు భద్రపరచుటకొరకు అందజేసారు. అయితే, వరదల కారణంగా అవి పోయాయి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దాన్ని చూడడం, రివ్యూ వ్రాయడం ఆయన చేసిన కృషికి నిదర్శనం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube