టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 11
గ్రామదీపికలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ 21 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.గ్రామదీపికల మండల స్థాయి సమావేశం షాహినా అధ్యక్షతన స్థానిక వెలుగు కార్యాలయం లో శనివారం జరిగింది.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బ్యాంకు రుణాలు మంజూరు చేయించడం లో గ్రామ దీపికలు కీలకపాత్ర పోషిస్తున్నారు అని,
వారికి ఇస్తున్న వేతనం చాలా తక్కువ అని అది కూడా నెలనెల ఇవ్వకపోవడం తో అనేక ఇబ్బందులు వారు పడుతున్నారు అని,
58 వ జీవో ను సవరించాలని, లైవ్ మీటింగ్ లాగిన్ గ్రామదీపికల కు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట గ్రామదీపికల
నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు గా సిహెచ్ జయలక్ష్మి, ఎస్కే షాహిన కమిటీ సభ్యులు గా శివకుమారి, రేవతి, బేబి ని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు యం అప్పన్న,బాగ్యలత, పద్మ,శ్రీదేవి, సువార్త,లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.